వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన భూమా అఖిలప్రియ!

  • ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు
  • మొత్తం రాయలసీమకే గర్వకారణం
  • ఆయన పేరును జగన్ చిరస్థాయిని చేశారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించినట్టు నిన్న జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ చేసిన ప్రకటన తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరును పెట్టడం మొత్తం రాయలసీమకే గర్వకారణమని అన్నారు. తొలి స్వాతంత్య్ర సమర యోధుడిగా, రాయలసీమకు చెందిన త్యాగశీలిగా పరిచితమైన ఉయ్యాలవాడ పేరు ఇకపై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్ చేశారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.

Jagan
Uyyalawada Narasimhareddy
Bhuma Akhila Priya
Orvakallu
Airport

More Telugu News